పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవలే అనౌన్స్ చేసిన మరో భారీ ప్రాజెక్ట్ “సలార్ ” కెజిఫ్ దర్శకుడు ప్రశాంత్ నిల్ తో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ సాలిడ్ చిత్రం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. మరి అదే క్రమంలో కొంత కాలం నిరీక్షణ అనంతరం ఈ సెన్సషనల్ కాంబో నుంచి అనౌన్స్మెంట్ సహా పోస్టర్ కూడా రావడం మళ్ళీ అన్ని వర్గాలలో హీట్ మొదలైయింది.
ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంకు గాను ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్యాస్టింగ్ మరియు టెక్నికల్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా లో సాలిడ్ విలన్ రోల్ కు గాను మళ్ళీ బాలీవుడ్ నుంచే ఓ స్టార్ నటుడునే తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే కెజిఫ్ లోని అధీరాగా సంజయ్ దత్ ను, ప్రశాంత్ నీల్ తీసుకున్నారు. మరి ఇప్పుడు ఓ సీనియర్ స్టార్ నటుడునే సలార్ లో ప్రభాస్ కు అప్పోజిట్ గా తీసుకోనున్నారట. మరి ఆ స్టార్ నటుడు ఎవరో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగక తప్పదు.
ప్రస్తుతం ప్రభాస్, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ చిత్రం లో నటిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే కథానాయిక.