గత ఏడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల విడుదల కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా చాలా క్లీయర్ గా అదుపులో ఉంది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకుని జనాలు థియేటర్లకు వస్తుండడంతో 2021 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు. జనవరి 9న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు.
ముందు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 12 లేదా 13వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సంక్రాంతి కానుకగా నాలుగు అయిదు సినిమాలు రాబోతున్నాయి. అందులో తమిళ హీరో విజయ్ మాస్టర్ సినిమా కూడా ఉంది. అందుకని ఈ సినిమాను ఈనెల 9వ తారీకునే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు.
రవితేజ చాలా కాలం నుండీ సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో అనే నమ్మకాన్ని సంపాదించుకున్న రవితేజ, గత రెండేళ్లుగా వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు.
ఇప్పుడు ఎలా అయినా హిట్టు కొట్టాలని గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ‘క్రాక్’ చిత్రం చేశాడు. రవితేజ హీరోగా గతంలో గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించబోతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.
క్రాక్ ట్రైలర్ కు అద్బుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్టు అని ఇండస్ట్రీ టాక్.
నటీనటులు : రవి తేజ, శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని
డైరెక్టర్ : గోపీచంద్ మలినేని
ప్రొడ్యూసర్ : బి. మధు
రైటర్ :గోపీచంద్ మలినేని
డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా
మ్యూజిక్ : ఎస్. థమన్
సినిమాటోగ్రఫీ : G. K. విష్ణు
ఎడిటర్ : నవీన్ నూలి
ప్రొడక్షన్ : సరస్వతి ఫిలిమ్స్ డివిజన్